![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -434 లో..... కార్తీక్ ఫ్రెండ్ కాల్ చేసాడని వెళ్తాడు. నిజానికి చేసింది జ్యోత్స్న.. జ్యోత్స్నని కలవడానికి కార్తీక్ వస్తాడు. ఎందుకు నన్ను రమ్మన్నావని కార్తీక్ అడుగుతాడు. ఈ పెళ్లి మా అమ్మనాన్న చేతులు మీదుగా జరగాలని కండిషన్ ఎందుకు పెట్టావ్.. ఇదంతా కావాలనే చేస్తున్నావ్ కదా.. నేను ఆలా జరగనివ్వనని జ్యోత్స్న అంటుంది.
జరుగుతుంది నువ్వు కేవలం నీ గురించి మాత్రమే ఆలోచిస్తావ్ కానీ నేను నా కుటుంబం గురించి ఆలోచిస్తాను ఖచ్చితంగా మా పెళ్లి జరుగుతుందని కార్తీక్ అంటాడు. జరగదని జ్యోత్స్న ఛాలెంజ్ చేస్తుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఈ పెళ్లి జరుగుతుందని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు. మరొకవైపు భోజనం చేస్తూ మాట్లాడుకుందామని శివన్నారాయణతో దశరథ్ అంటాడు. సుమిత్ర ఎక్కడ అని శివన్నారాయణ అడుగుతాడు. రాదట అని పారిజాతం చెప్తుంది. నువ్వెందుకు చెప్తున్నావని శివన్నారాయణ అంటాడు. అప్పుడే సుమిత్ర వచ్చి.. నేను మీరు తీసుకున్న ఏ నిర్ణయానికి ఎదురు మాట్లాడలేదు కానీ ఈసారి నా వల్ల కావట్లేదు మావయ్య అని సుమిత్ర అంటుంది.
నా కూతురిని చంపాలని అనుకుంది.. అలాంటి తన పెళ్లి నా చేతులు మీదుగా అంటే నేను ఒప్పుకోనని సుమిత్ర అంటుంది. నీకు కూడా ఇష్టం లేదని చెప్పు జ్యోత్స్న అని పారిజాతం అంటుంది. తాత నిర్ణయమే నా నిర్ణయమని చెప్పి జ్యోత్స్న అందరికి షాక్ ఇస్తుంది. తాత మన గురించి అలోచించి ఇదంతా చేస్తున్నాడు మమ్మీ ఒప్పుకోమని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. నా మనవరాలు ఏదో ప్లాన్ చేసినట్లు ఉంది.. మనం కూడా ఒప్పుకోవాలని పారిజాతం అనుకొని.. నేను ఆయన నిర్ణయానికి సపోర్ట్ చేస్తానని పారిజాతం అంటుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వస్తాడు. జరిగిందంతా దీపకి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |